ఈ నెల 17న చిలకలూరిపేట బొప్పూడి వద్ద జరిగే టీడీపీ కూటమి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభా స్థలిని ఈరోజు ఉదయం యువనేత లోకేష్‌తో కలిసి ప్రత్తిపాటి పరిశీలించారు. లోకేష్‌తో పాటు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు, టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్య నేతలతో కలిసి సభా స్థలాన్ని యువనేత పరిశీలించారు. వివిధ కమిటీలతో భేటీ అయ్యి సభ ఏర్పాట్ల గురించి లోకేష్ చర్చించారు. లక్షలాదిగా ప్రజలు రానున్న సందర్భంగా వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. సభా ప్రాంగణం వద్ద భూమి పూజా కార్యక్రమంలో నారా లోకేష్, మూడు పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. పొత్తు కుదిరిన తరువాత నిర్వహిస్తున్న మొదటి సభను మూడు పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. ప్రధాని మోదీ పాల్గొనే సభ ఏర్పాట్లను నారా లోకేష్ స్వయంగా పర్యవేక్షిస్తున్నారు.