ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కర్నూలు శివారులోని జగన్నాథ గట్టుపై నేషనల్ లా యూనివర్సిటీకి శంకుస్థాపన చేయనున్నారు. తర్వాత బనగానపల్లెలో రూ.22 కోట్లతో నిర్మించిన 100 పడకల ఆసుపత్రిని ప్రారంభించనున్నారు. అలాగే బనగానపల్లెలో వైఎస్సార్ ఈబీసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేయనున్నారు. సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో ఎస్పీ రఘువీర్‌రెడ్డి, కలెక్టర్ శ్రీనివాసులు, జాయింట్ కలెక్టర్ రాహుల్‌కుమార్‌రెడ్డి, ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డితో కలసి బనగానపల్లె పట్టణంలో సభా ఏర్పాట్లు పరిశీలించారు. పట్టణంలో సభాస్థలి, పార్కింగ్ ప్రదేశాలను పరిశీలించారు. హెలిప్యాడ్ ఏర్పాటు చేయడానికి స్థలాన్ని సేకరించారు. హెలిప్యాడ్‌ను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.