ప్రజలపై తరచూ దాడులకు పాల్పడుతూ మరణాలకు కారణమవుతున్న 23 జాతులకు చెందిన పెంపుడు శునకాల అమ్మకాలపై నిషేధం విధించాలంటూ రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది.
పిట్‌బుల్‌టెర్రియర్, అమెరికన్‌బుల్‌డాగ్, రోట్‌వీలర్, మస్టిఫ్స్, టొసాఇను, అమెరికన్‌స్టాఫర్డ్‌షైర్ టెర్రియర్, డోగోఅర్జెంటీనో, సెంట్రల్‌ఆసియన్ షెఫర్డ్, సౌత్‌రష్యన్ షెఫర్డ్, వూల్ఫ్‌డాగ్స్, మాస్కోగార్డ్ తదితర జాతుల శునకాలు ఈ జాబితాలో ఉన్నాయి. వీటి సంతాన వృద్ధి(బ్రీడింగ్)ని కూడా అడ్డుకొనేలా చర్యలు చేపట్టాలని కేంద్రం తెలిపింది.