చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురంలో గురువారం ఉదయం రూ. 75 లక్షలతో సి. సి. రోడ్, డ్రైనేజ్ పనులకు ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం సంక్షేమంతో పాటు అభివృద్ధి పనులకు ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. చింతకొమ్మదిన్నె జెడ్పిటిసి పి. నరేన్ రెడ్డి, స్థానిక నాయకులు, అధికారులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.