లోకేష్ బాధిత గీతాంజలి కుటుంబాన్నే విమర్శించడం నీచ రాజకీయాలకు నిదర్శనం అని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి, వైసిపి పెనుకొండ ఎమ్మెల్యే అభ్యర్థి ఉషాశ్రీచరణ్ పేర్కొన్నారు. గురువారం పెనుకొండ పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో మంత్రి ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ బాధిత గీతాంజలి కుటుంబంకు అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా వుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, వైసిపి నాయకులు పాల్గొన్నారు.