నంద్యాల జిల్లా, బనగానపల్లె పట్టణానికి వైయస్సార్ ఈబిసీ నేస్తం మూడో విడత నిధులు విడుదల చేయడానికి విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తన మంచి మనసును మరోసారి చాటుకున్నారు. గూడూరు మండలం చనుగొండ్ల గ్రామ నివాసితుడు హరిజన గోరంట్ల తాను వికలాంగుడనని, పేదరికంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నానని... బికాం డిగ్రీ పూర్తి చేశానని పై చదువులకు, కోచింగ్ కు ఆర్థిక సహాయం అందించాలని కోరుతూ దరఖాస్తు సమర్పించగా... ముఖ్యమంత్రి వెంటనే స్పందించి పైచదువులకు 15,000 రూపాయలు, జీవనోపాధికి మరో 15000 సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించాలని కలెక్టర్ ని ఆదేశించారు. సియం ఆదేశాల మేరకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా 30 వేల రూపాయల చెక్కును కలెక్టర్, జాయింట్ కలెక్టర్ హరిజన గోరంట్లకు అందజేశారు.