ఎన్నికల్లో వాలంటర్లను వినయోగించడంపై ప్రభుత్వం సర్క్యులర్ జారీ చేసింది. వాలంటీర్లు ఎన్నికల విధుల్లో, ఇతర ప్రక్రియలో పాల్గొనకూడదని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కోర్టులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ వేసిన పిటిషన్‌పై విచారణ జరుగుతుండటంతో గత రాత్రి సర్క్యులర్ జారీ అయ్యింది. ఎన్నికల ప్రచారంలో క్షేత్ర స్థాయిలో విచ్చలవిడిగా వైసీపీ నేతలతో కలిసి వాలంటీర్లు తిరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఎన్నికలతో ముడిపడిన ఎలాంటి ప్రక్రియలోనూ వాలంటీర్లు పాల్గొనకూడదంటూ జిల్లా కలెక్టర్లకు చీఫ్ సెక్రటరీ ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల విధుల నుంచి తక్షణమే వాలంటీర్లను తొలగించాలని ఆర్డర్స్ పాస్ చేశారు. ఎన్నికల ప్రక్రియలో పాల్గొంటే ఈసీ మార్గదర్శకాలు ఉల్లంఘనే అని స్పష్టం చేశారు. పోలింగ్ ఏజెంట్లుగానూ వాలంటీర్లు ఉండరాదని జిల్లా కలెక్టర్లకు సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలిచ్చారు.