పీఎంయువై, పహల్ పథకాల ద్వారా లబ్ధి పొందిన వారి బయోమెట్రిక్ ను ఈనెల 31వ తేదీలోగా తీసుకోవాలని కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ గ్యాస్ కంపెనీలను ఆదేశించింది. ఈ మేరకు తమకు సర్కులర్లు అందాయని గ్యాస్ కంపెనీల ప్రతినిధులు శుక్రవారం తెలిపారు. చీరాల, పర్చూరు నియోజకవర్గాల పరిధిలోని ఈ పథకాల లబ్ధిదారులు వెంటనే తమ తమ కార్యాలయాలకు వచ్చి బయోమెట్రిక్ వేయాలని ఐఓసీఎల్, బీపీసీఎల్ హెచ్పిసిఎల్ డీలర్లు కోరారు.