పశ్చిమ బెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు వెల్లడించారు. దక్షిణ కోల్కతాలోని కాళీఘాట్ నివాసంలో కిందపడటంతో మమత తలకు తీవ్ర గాయం అయిన సంగతి తెలిసిందే.
ఆమెకు ముక్కుపై ఒకటి, నుదుటిపై మూడు కుట్లు పడ్డాయని ఎస్ఎస్కేఎం ఆసుపత్రి డైరెక్టర్ డాక్టర్ మణిమోయ్ బందోపాధ్యాయ్ తెలిపారు. వెనక నుంచి నెట్టడం వల్ల ఎలాంటి గాయాలవుతాయో అలాంటి దెబ్బలే దీదీకి తగిలాయని స్పష్టం చేశారు.