భారత్ వస్తు ఎగుమతులు ఫిబ్రవరిలో రికార్డు స్థాయిలో జరిగాయి. 11 నెలల గరిష్ట స్థాయిలో 4.40 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2023 ఏప్రిల్ లో ప్రారంభమైన ఆర్థిక సంవత్సరంలో ఈ స్థాయిలో ఎగుమతుల వృద్ధి నమోదు కావడం ఇదే మొదటిసారి కావడం విశేషం.
ఇంజనీరింగ్ గూడ్స్, ఎలక్ట్రానిక్, ఫార్మా ఎగుమతులు పెరగడం మొత్తం సానుకూల గణాంకాలకు దారి తీసింది. ఇక ఇదే కాలంలో దిగుమతులు 12.16 శాతం పెరిగి 60.11 బిలియన్ డాలర్లుగా నమోదు అయ్యాయి.