నర్సింగ్ చదివిన వారికి జపనీస్ భాషపై శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పిస్తున్నట్లు అనంత జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఆనంద్ రాజ్ కుమార్ శుక్రవారం తెలిపారు. అర్హులైన అభ్యర్థులకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ద్వార రూ. 25, 000 దరఖాస్తు రుసుము కొరకు స్కాలర్షిప్ పొందే అవకాశం కూడ కల్పిస్తున్నట్లు మీడియాకు తెలిపారు. అభ్యర్థులు జపాన్ దేశంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని, 32 సంవత్సరాలు లోపు వయసు ఉండాలన్నారు.