కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై స్టే విధించాలని కోరుతూ కేరళలోని పినరయి విజయన్ ప్రభుత్వం శనివారం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. మతం ఆధారంగా దేశ పౌరసత్వం ఇవ్వడం సరికాదని అభిప్రాయపడింది.
కాగా దీనిపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా మరో పిటిషన్ వేశారు. ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై ఈనెల 19న ఒకేసారి విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa