శెట్టూరు మండలం అయ్య గార్లపల్లిలో వైసీపీ నుంచి పలువురు మహిళలు ఆదివారం టీడీపీలో చేరారు. కళ్యాణదుర్గం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి సురేంద్రబాబు తనయుడు యశ్వంత్ చౌదరి సమక్షంలో వైసీపీ వీడి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారందరికీ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా యశ్వంత్ చౌదరి మాట్లాడుతూ మా నాన్నను గెలిపిస్తే కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి చేస్తారన్నారు.