ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పాల్గొన్న ‘‘ప్రజాగళం’’ బహిరంగసభలో పోలీసులు వైఫల్యం చెందారంటూ కూటమిలోని సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై నిన్ననే (ఆదివారం) ప్రధాని మోదీకి బీజేపీ నేతలు ఫిర్యాదు చేశారు. కేంద్ర హోంమంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. కోడ్ అమలులోకి రావడంతో ఈరోజు ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లాలని నిర్ణయించారు. డీజీపీ, డీఐజీ, పలనాడు జిల్లా ఎస్పీలపై మూడు పార్టీల నేతలు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయనున్నారు. ఈరోజు సాయంత్రం సీఈవోను కలిసి ఫిర్యాదు చేయనున్నారు.