హిమాచల్‌ప్రదేశ్‌కు చెందిన ఆరుగురు కాంగ్రెస్ రెబల్ ఎమ్మెల్యేల అనర్హత వేటు ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కుల్దీప్ సింగ్ పఠానియా కార్యాలయానికి నోటీస్ జారీ చేసింది.
నాలుగు వారాల్లో ప్రతిస్పందించాలని కోరింది. అనర్హత పిటిషన్‌పై తీర్పు పెండింగ్‌లో ఉన్నందున అసెంబ్లీలో ఓటు వేయడానికి లేదా అసెంబ్లీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి వారికి అనుమతి లేదని సుప్రీం తెలిపింది.