యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి సన్నిధిలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా పదవ రోజు ఉదయం మహా పూర్ణాహుతి, చక్రతీర్థం కార్యక్రమాలు జరిగాయి.
ఈ రోజు రాత్రి కూడా ఆలయ అర్చకులు శ్రీపుష్పయాగం, దేవతోద్వాసనం, దోపు ఉత్సవం తదితర కార్యక్రమాలు నిర్వహిస్తారు. కాగా, యాదాద్రిలో గత 10 రోజులుగా బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి.