ఏపీలో వాలంటీర్ల తొలగింపు వ్యవహారం అధికారులకు తలనొప్పిగా మారింది. చిత్తూరు జిల్లాలో తాజాగా మరో ఇద్దరు వాలంటీర్లను జిల్లా యంత్రాంగం తొలగించింది.
ఇప్పటివరకు చిత్తూరు కార్పొరేషన్లో 18 మంది, పలమనేరు మున్సిపాలిటీలో 12 మంది, గుడిపాల మండలంలో ముగ్గురు, పులిచెర్లలో ఇద్దరు వాలంటీర్లను తొలగించారు. జిల్లా వ్యాప్తంగా మరో 163 మంది వాలంటీర్లు ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు జిల్లా యంత్రాంగం గుర్తించినట్లు సమాచారం.