ఆంధ్రప్రదేశ్‌లో ఎన్డీయే కూటమికి మద్దతు ఇస్తున్నట్లు లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ చేసిన ప్రకటనపై తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు స్పందించారు. "ప్రగతిశీల మరియు ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ కోసం టీడీపీ-జేఎస్పీ-బీజేపీ కూటమికి మద్దతు ఇవ్వాలని జయప్రకాష్ నారాయణ గారు తీసుకున్న నిర్ణయాన్ని నేను స్వాగతిస్తున్నాను. తీవ్ర ముప్పు పొంచి ఉన్న మన రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు సమాన ఆలోచనలు గల వ్యక్తులు, సంస్థలు అందరూ కలిసి రావాలి" అని చంద్రబాబు తెలిపారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa