చిప్పగిరి: నిరుపేదల జీవితాలలో సుఖ సంతో షంగా బతకడానికి మార్పులు తెచ్చిన ఏకైక వ్యక్తి మన జగనన్న అని, వారి కోసమే అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి వారికి ఆర్థికంగా చేదోడు గా వాదోడుగా నిలబడ్డారని ఆలూరు వైసీపీ అభ్యర్థి విరుపాక్షి తెలిపారు. శుక్రవారం మండ లంలోని దౌల్తాపురం, నంచర్ల గ్రామాలలో ఆయ న పర్యటించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు వర్తించాయా, లేదా అని అడిగి తెలుసుకున్నారు.