రైతులకు స్వల్పకాలిక రుణాలు అందించేందుకు కేంద్ర ప్రభుత్వం 'కిసాన్ క్రెడిట్ కార్డు' పథకం అమలు చేస్తోంది. 7 శాతం వడ్డీతో రూ.3 లక్షల వరకు రైతులు సకాలంలో రుణం పొందొచ్చు.
రైతులు ఎలాంటి సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సిన అవసరం లేదు. నిర్ణీత గడువులో చెల్లిస్తే 3 శాతం మేర వడ్డీ రాయితీ లభిస్తుంది. దీనిని ప్రధానమంత్రి ఫసల్ బీమాయోజనతో అనుసంధానించారు. దీని కోసం స్థానిక బ్యాంకులను సంప్రదించవచ్చు.