ఓటు వేయాలని ఒకరిని ఎలా బలవంతం చేస్తారని మద్రాసు హైకోర్టు ఓ పిటిషనర్‌ను ప్రశ్నించింది. తమిళనాడు తిరుచ్చెందూర్‌కు చెందిన రామ్‌కుమార్ 'చట్టప్రకారం ఉద్యోగులు పోలింగ్ రోజు వేతనంతో కూడిన సెలవు తీసుకుంటున్నారు.
వారు ఓటు వేసినట్లు తెలిపే ధ్రువపత్రం సమర్పించడాన్ని తప్పనిసరి చేయాలి' అని పిటిషన్ వేశాడు. విచారణ చేపట్టిన కోర్టు ధ్రువపత్రం సమర్పించాలని ఆదేశించలేమని తీర్పిచ్చింది.'ఓటు వేయాలని బలవంతం చేయలేం'