మహమ్మారి కరోనా నియంత్రణ కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించి నేటితో నాలుగేళ్లు పూర్తయింది. 2020 మార్చి 24 అర్ధరాత్రి నుంచి కరోనా వైరస్ వ్యాప్తికి అడ్డుకట్ట వేయడమే లక్ష్యంగా లాక్డౌన్ అమల్లోకి వచ్చింది. తొలుత 21 రోజులు విధించిన ఈ లాక్డౌన్ను క్రమంగా మూడుసార్లు పొడిగించారు. అత్యంత కఠినంగా అమలైన ఈ లాక్డౌన్ భారతదేశ ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసింది. రికార్డు స్థాయిలో జీడీపీ పడిపోయేందుకు కారణమైంది.