ఈ ఎన్నికల్లో పార్టీ విజయం కోసం శ్రమించే కార్యకర్తలను గుర్తించి వారికి అండగా ఉంటానని గాజువాక నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి, రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. గాజువాక పరిధి 65వ వార్డు కార్పొరేటర్ బొడ్డు నరసింహ పాత్రుడు ( కేబుల్ మూర్తి) ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో మంత్రి అమర్నాథ్ పాల్గొని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.