భారతీయ ఈక్విటీల్లో విదేశీ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెడుతున్నారు. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో అనుకూల పరిణామాలు, భారత ఆర్థిక వృద్ధి బలంగా ఉండటం వంటి అంశాలు వారిని ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు(ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటివరకు రూ. 38,000 కోట్లకు పైగా నిధులను దేశీయ ఈక్విటీల్లో పెట్టారు. అంతకుముందు జనవరిలో రూ. 25,743 కోట్లు, ఫిబ్రవరిలో రూ. 1,539 కోట్ల పెట్టుబడులు వచ్చాయి.