ఎన్నికల వేళ సైబర్ నేరగాళ్లు విజృంభిస్తున్నారు. రాజకీయ పార్టీలు, ఎలక్షన్ కమిషన్ పేరిట మోసాలకు పాల్పడుతున్నారు. ఓటర్ కార్డు ఆన్లైన్ లో నమోదు కాలేదని, ఎన్నికల సర్వేలో పాల్గొంటే బహుమతులని ప్రజల ఫోన్లకు లింకులు పంపిస్తున్నారు. వాటిని క్లిక్ చేయగానే బ్యాంకు ఖాతాలను ఖాళీ చేస్తున్నారు. ఇలాంటి వాటిపై అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి లింకులను క్లిక్ చేయొద్దని సైబర్ క్రైమ్ అధికారులు సూచిస్తున్నారు.