అడ్డగోలు సంపాదనకు అలవాటుపడిన జె-గ్యాంగ్ ఇప్పటికే రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి మయం చేశారని వైసీపీ నేతలు, CM జగన్పై నారా లోకేశ్ మండిపడ్డారు. 2020లోనే రాష్ట్రానికి గ్యాంబ్లింగ్ తేవాలని ప్రయత్నించారని ఆరోపించారు.
ఇందులో భాగంగానే ఒక లాటరీ అండ్ గేమింగ్ కంపెనీ నుంచి వైసీపీకి రూ. 160 కోట్లు ఎలక్టోరల్ బాండ్లు అందాయని చెప్పారు. ఇవాళ మంగళగిరి నియోజకవర్గంలో పర్యటించిన లోకేశ్ ఈ మేరకు మాట్లాడారు.