వారంతం, హోలీ సెలవు కలిసి రావటంతో తిరుమల కొండపై భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్ట్మెంట్లు భక్తులతో నిండిపోయాయి.
శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతోంది. ఆదివారం శ్రీవారిని 80,532 మంది భక్తులు దర్శించుకోగా, 29,438 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.3.95 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు.