టీడీపీ, బీజేపీతో కలిసి జనసేన కూటమిగా బరిలోకి దిగుతోంది. ఈ నేపథ్యంలో పొత్తులో భాగంగా జనసేనకు 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లను కేటాయించారు. కాగా ఇప్పటికే కాకినాడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించిన జనసేన మచిలీపట్నం ఎంపీ అభ్యర్థి పై ఫోకస్ పెట్టింది. ఇన్నాళ్లూ సిట్టింగ్ ఎంపీ బాలశౌరికే సీటు దక్కుతుందని ప్రచారం జరగగా, అధిష్ఠానం క్లారిటీ ఇవ్వలేదు. అయితే మచిలీపట్నం ఎంపీ స్థానంలో జనసేన తరఫున పోటీకి వంగవీటి రాధా పేరు తెరపైకి వచ్చింది. అయితే వంగవీటి రాధా, బాలశౌరితో చర్చలు జరిపి సీటు పై క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది.