ఒంగోలులోని చేపల మార్కెట్ పై మాజీ ఎమ్మెల్యే దామచర్ల రాజకీయం చేయటం హాస్యాస్పదంగా ఉందని ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ రెడ్డి విమర్శించారు. ఆదివారం నగరంలోని చేపల మార్కెట్ ను సందర్శించి అక్కడ సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా బాలినేని మాట్లాడుతూ చేపల మార్కెట్ ఎవరి హయాంలో అభివృద్ధి జరిగిందో అందరికీ తెలుసన్నారు ఎన్నికల సమయంలో టిడిపి నాయకులు రాజకీయం చేసేందుకు కుట్ర పన్నడం దుర్మార్గంగా ఉందన్నారు.