ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏకపక్షంగా పోలీసులు వ్యవహరిస్తున్నారు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Mar 25, 2024, 04:20 PM

ఎన్నికల  కోడ్ వచ్చినా పోలీస్ వ్యవస్థ భయం లేకుండా ఇంకా ఎందుకు అధికార పార్టీకి కొమ్ముకాస్తోందని తెలుగుదేశం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న  ప్రశ్నించారు. డీజీపీని విధుల నుంచి తప్పించాలని కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాస్తున్నామన్నారు. ఒంటిమిట్ట సుబ్బారావు కుటుంబానికి జరిగిన అన్యాయం వెనుక పాత్రధారుల పై 24గంటల్లో పోలీసు చర్యలు తీసుకోవాలని బుద్దా వెంకన్న డిమాండ్ చేశారు. బీసీలకు అన్యాయం జరిగితే పోలీసులు పట్టించుకోరా ? అని నిలదీశారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్  అంటే ప్రభుత్వానికి భయం కాబట్టే అడుగడుగునా తనిఖీ చేస్తున్నారని బుద్దా వెంకన్న తెలిపారు. మంగళగిరిలో లోకేష్‌ని ఓడించటానికి రూ.500 కోట్లు దాచారని ఆరోపించారు. పోలీసు ఎస్కార్ట్ తో నల్ల డబ్బును సాక్షి వాహనాల్లో రాష్ట్ర మంతటా పంపిణీ చేస్తున్నారని బుద్దా వెంకన్న తెలిపారు. ఓటుకు రూ.30 వేలైనా మంగళగిరిలో పంచేందుకు సిద్ధమయ్యారన్నారు. ప్రజల నుంచి జగన్ కాజేసిన డబ్బుని ఇప్పుడు పంచుతున్నాడన్నారు. ప్రజలు జగన్ ఇచ్చే డబ్బు తీసుకుని ఓటు మాత్రం సైకిల్‌కి వేయాలని పిలుపునిచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com