‘కుప్పం అభివృద్ధికి 35 ఏళ్ల పాటు నేను పడిన కష్టాన్ని కేవలం ఐదేళ్ల వైసీపీ పాలనలో సర్వనాశనం చేశారు అని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. అధికారంలోకి రాగానే తిరిగి అభివృద్ధిని పట్టాలెక్కిస్తా’నని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. దీనికి అవసరమైన అన్ని ప్రణాళికలు రచించి అమలు చేస్తామని చెప్పారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం ఆయన కుప్పం నుంచి ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. ఆర్టీసీ బస్టాండు సర్కిల్లో ఎన్టీఆర్ విగ్రహం ఎదుట ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. రాష్ట్రంలో రెండంకెల అభివృద్ధి సాధిస్తే, కుప్పంలో మూడంకెల అభివృద్ధి తీసుకొస్తానన్నారు.