నారా భువనేశ్వరి ఈ నెల 26, 27 తేదీలలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా లో పర్యటించనున్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు పెట్టి జైలుకు పంపిన సమయంలో ఆయన వీరాభిమాను లు కొందరు మనోవేదనకు గురై అకాల మరణం చెందారు. వీరిలో జంగారెడ్డిగూడెం మండలం పేరంపేటకు చెందిన భీమడోలు వెంకన్న, కొయ్యలగూడెం మండలం యర్రం పేట, కన్నాయిగూడెం, బయ్యన్నగూడెం గ్రామాల్లో చండ్ర చిన్న కన్నయ్య, డి.వెంకటలక్ష్మి మార్గాని వెంకటేశ్వరరావు ఉన్నారు. వీరి కుటుంబాలను పరామర్శించి, ధైర్యం చెప్పేం దుకు ‘నిజం గెలవాలి’ పేరిట భువనేశ్వరి రానున్నారు. పోలవరంతోపాటు తాడేపల్లిగూడెం, ఉంగుటూరు నియోజ కవర్గాల్లోనూ బాధిత కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శిం చనున్నారు. ఈ మేరకు పార్టీ ఏర్పాట్లు చేయనున్నట్లు ఆదివారం ఏలూరులో జరిగిన విలేకరుల సమావేశంలో పార్టీ అధ్యక్షుడు గన్ని వీరాంజనేయులు, టీడీపీ జోన్ 2 ఇన్చార్జి మందలపు రవి, మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి, పార్టీ ప్రధాన కార్యదర్శి జగదీష్‌బాబు ప్రకటించారు.