‘నర్సాపురం ఎంపీ రఘరామకృష్ణరాజు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా మేం ఆయనకు అండగా ఉండి గెలిపిస్తాం. వైసీపీ అప్రజాస్వామిక పాలనా విధానాలు, సీఎం జగన్పై ప్రాణాలొడ్డ్డి పోరాడిన ఏకైక నాయకుడు త్రిబుల్ ఆర్’ అని అమరావతి బహుజన జేఏసీ అధ్యక్షుడు పోతుల బాలకోటయ్య అన్నారు.‘రఘురామకు ఎంపీ సీటు ఇవ్వడానికి కూటమిలోని మూడు పార్టీలకు ఎందుకు చేతులు రావడం లేదు? ఆయనకు సీటు ఇవ్వకపోవడాన్ని రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు ఇంద్రధనస్సును మించిన రంగుల్లో కనిపిస్తున్నాయి. సీట్ల కేటాయింపులు కొంత గందరగోళంగా, నిరాశ నిస్పృహలతో ఉండటం చాలా మందిని బాధిస్తోంది’ అని బాలకోటయ్య అన్నారు. నవక్రాంతి పార్టీ అధ్యక్షుడు కనకం శ్రీనివాసరావు, రెల్లి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శిరంశెట్టి నాగేంద్రరావు తదితరులు పాల్గొన్నారు.