ఎన్నికల విధులు నుంచి 431 మంది ఉద్యోగులకు అనంత జిల్లా లో బుధవారం మినహాయింపునిచ్చారు. ఎన్నికల విధులు కేటాయించిన ఉద్యోగుల్లో గర్భిణులు, బాలింతలు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలున్న వారికి మినహాయింపునకు అవకాశం కల్పించినట్లు ఎన్నికల అధికారులు బుధవారం తెలిపారు. జిల్లాలో ఎన్నికల విధులకు 581 మంది ఉద్యోగులు దరఖాస్తు చేసుకోగా. విచారణకు 372 మంది గైర్హాజయ్యారు. హాజరైన 209 మందిలో 186 మందికి మినహాయింపు ఇచ్చారు.