ఆముదాలవలస మండలం తిమ్మాపురం జంక్షన్ వద్ద స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ టీం పోలీస్ సిబ్బంది ఎన్నికల నేపథ్యంలో సాధారణ వాహన తనిఖీలు చేపట్టారు. సరైన బిల్లు లేకుండా నగదు తరలిస్తున్న రెండు ద్విచక్ర వాహనాలను మరియు నగదును సీజ్ చేసినట్లు పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. ఒక వాహనంలో రూ. 82, 830, మరో వాహనంలో రూ. 54, 630 నగదును స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.