రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గిరి శిఖర గ్రామాలకు విద్య వైద్యం మౌలిక సదుపాయాల కల్పనలో ముందుచూపుతో వ్యవహరించారని పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి అన్నారు. ఆమె బుధవారం మెలియాపుట్టి మండలంలోని గిరి శిఖర గ్రామాలైన కే, చందనగిరి గ్రామాలను సందర్శించి ప్రభుత్వం గిరిజనులకు అందిస్తున్న సంక్షేమాలను వివరించారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేయాలని కోరారు.