ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు.. కేజ్రీవాల్ అరెస్ట్ వ్యవహారంలో ఇతర దేశాల జోక్యం పెరుగుతోంది. మొన్నామధ్య జర్మనీ దీనిపై ప్రకటన చేయగా.. తాజాగా అమెరికా కూడా స్పందించింది. ఈ కేసులో పారదర్శక విచారణను ప్రోత్సహిస్తున్నామని అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి పేర్కొన్నారు. ఈ పరిణామాలపై భారత్ తీవ్రంగా స్పందించింది. ఢిల్లీలోని ఆ దేశ రాయబారికి సమన్లు జారీ చేసింది.