ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలో ఎన్నికల కోడ్ సరిగా అమలు కావటం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. గిద్దలూరు పట్టణంలోని రాజుల గేటు సెంటర్లో ఉన్న ఓ శిలాఫలకానికి అధికారులు ముసుగు తొడగకపోవడంపై స్థానిక ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గురువారం రోజు శిలాఫలకం యధావిధిగా ఉండడాన్ని స్థానిక ప్రజలు గమనించి అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గిద్దలూరులో ఎన్నికల కోడ్ సరిగా అమలు కావటం లేదని అంటున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa