నాగార్జున సాగర్ జలాశయంలో ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవాలని పల్నాడు జిల్లా కలెక్టర్ ఎల్. శివశంకర్ ఆదేశించారు. ఈ అంశమై సంబంధిత అధికారులతో పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని తన క్యాంపు కార్యాలయంలో కలెక్టర్ బుధవారం సమీక్షించారు.
నీటి సరఫరాలపై గ్రామాల్లో నిత్యం పర్యవేక్షించాలని, అవసరాలకు అనుగుణంగానే సరఫరా చేయాలని చెప్పారు. వాన నీటి సంరక్షణ చర్యలు చేపట్టాలన్నారు.