గిట్టుబాటు ధర లభించేలా వేతన దారులు పనులు చేసుకోవాలని ఉపాధి హామీ పథకం అంబుత్స్ మెన్ అన్నపూర్ణ కోరారు. గురువారం గజపతినగరం మండలంలోని మరుపల్లి పంచాయతీ తమ్మారాయుడుపేట గ్రామంలో జరుగుతున్న ఉపాధి హామీ పథకం పనులను ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎండల తీవ్రత ఎక్కువగా ఉన్నందున తొందరగా వచ్చి పనులు చేసుకోవాలని సూచించారు. జాబ్ కార్డు ఉన్నవారికి పనులు కల్పించాలన్నారు. ఏపీవో సిహెచ్ రామారావు పాల్గొన్నారు.