ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 28, 2024, 09:02 PM

జనసేనా పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం ఖరారైంది. మార్చి 30 నుంచి ఆయన ఎన్నికల ప్రచారం చేయనున్నారు. ఈ ప్రచారానికి 'వారాహి విజయభేరి' అని పేరు పెట్టారు. తాను అసెంబ్లీకి పోటీ చేస్తున్న పిఠాపురం నియోజకవర్గం నుంచి పవన్ తన వారాహి విజయభేరి ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. ఈ నెల 30న సాయంత్రం 4 గంటలకు చేబ్రోలు రామాలయం సెంటర్ లో తొలి సభ ప్రారంభం కానుంది అని తెలిపారు.ఈ ఎన్నికల్లో జనసేన పార్టీ 21 అసెంబ్లీ స్థానాలు, 2 ఎంపీ స్థానాల్లో పోటీ చేస్తోంది.


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com