ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అతను శవాల మీద పేలాలు ఏరుకునే రకం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Mar 29, 2024, 09:08 AM

టీడీపీ నేత కొల్లు ర‌వీంద్ర‌పై వైయ‌స్ఆర్‌సీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ మంత్రి పేర్నినాని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. కొల్లు ర‌వీంద్ర సిగ్గు శ‌రం లేకుండా అబ‌ద్దాలు చెబుతాడ‌ని నాని విమ‌ర్శించారు. గురువారం మాజీ మంత్రి మీడియాతో మాట్లాడుతూ.... కొల్లు రవీంద్ర శవాల మీద పేలాలు ఏరుకునే రకం. నిజాన్ని దాచిపెట్టి అబద్ధాలు మాట్లాడుతున్నాడు . తాను చేయని పనులను కూడా చేశామని చెప్పుకోవడం సిగ్గులేనితనానికి నిదర్శనం. ప్రస్తుతం ఎన్నికల కోడ్‌లో ఉన్నాం . అధికారులతో సమీక్షలు చేసి మాట్లాడి తాగునీటి సమస్యను పరిష్కరించే అవకాశం లేదు. కృష్ణా నదిలో , శ్రీశైలం ప్రాజెక్ట్‌లో నీరులేకపోవడం, పులిచింతల నుండి నీటిని వాడుకుంటున్నాం. ప్రస్తుతం 4.5 టీఎంసీ తాగు నీటిని కృష్ణ, గుంటూరు, ప్రకాశం వాడుకోవాలి. సెప్టెంబర్, ఆగస్టు ప్రాంతాలలో గోదావరి, కృష్ణా నదులలో వరద వచ్చే అవకాశం ఉంది. అప్పటివరకు ఈ 4.5 టీఎంసీ నీటినే జాగ్రత్తగా వాడుకోవాలి. గతంలో ఎప్పుడూ ఇలా ఇబ్బంది రాలేదు. తరకటూరు , పంపుల చెరువు లోతు 12 అడుగులు.... 5.2 మీటర్లు స్టోరేజ్ ను పెడతారు. నీరిచ్చిన ప్రతి రోజూ 100 గ్రామాలకు గాను 7 సెంటి మీటర్లు లోతు నీటి సాంద్రత తగ్గుతుంది. పొలిటికల్ నిర్ణయం తీసుకునే పరిస్థితి లేదు. అధికారులు ఎవ్వరూ ఇప్పటి వరకు వేసవిలో నీరు ఇస్తామని చెప్పే పరిస్థితి లేదు. ముందు చూపు లేనిది ఎవరికి.. కొల్లు రవీంద్ర ఏమైనా పనొడా?కొల్లు రవీంద్రకు ఛాలెంజ్ చేస్తున్నా. ప్రస్తుతం 9 అడుగుల నీరు నిల్వ వుంది చూసుకో. టీడీపీ సమయంలో రోజూ నీరిచ్చామని దగాకోరు మాటలు మాట్లాడుతున్నాడు. 2018 లో మురికి నీరుకు జనం అల్లాడిపోయారు. కొల్లు రవీంద్రా...అప్పుడు మేము ధర్నా చేశాం. అప్పుడు తమరు పచ్చరంగు నీరు సప్లై చేస్తున్నందుకు ధ్వజమెత్తిన పేర్ని అంటూ విలేకరులు మీ సొంత పత్రికలలో రాశారు. కొల్లు రవీంద్ర ముందు చూపు గురించి మాకు తెలియదా?పేర్ని నాని వచ్చిన తరవాత ఎవరైనా బోర్లు వేశారా ... నీటి కోసం ఇబ్బంది పడ్డారా?కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడు అని ఆగ్రహం వ్యక్తపరిచారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com