జగన్ ప్రయాణిస్తున్న బుల్లెట్ ప్రూఫ్ బస్సు నంద్యాల శివారు భోజన విడిది కేంద్రం వద్దకు రాగానే చెడిపోయింది. దీంతో సభా ప్రాంగణానికి వేరే వాహనంలో జగన్ వచ్చారు. సభ ముగిసే సమయానికి బస్సు బాగవడంతో మళ్లీ బస్సులో తిరుగు పయనమయ్యారు. ఇక ఆళ్లగడ్డ నుంచి నంద్యాల వరకు సాగిన బస్సు యాత్రలో ఎర్రగుంట్ల సమావేశం మినహా ఎక్కడా ర్యాలీ సాగలేదు. ఈ రెండు మండలాల మధ్య ఉన్నది ఎక్కువ శాతం జాతీయ రహదారి కావడంతో మధ్యలో తగిలిన గ్రామాల్లో కార్యకర్తలకు అభివాదం చేసుకుంటూ జగన్ సాగిపోయారు. సభ అనంతరం పాణ్యం మండలంలోని ఆర్జీఎం కళాశాల వద్ద విద్యార్థులకు అభివాదంచేస్తూ కర్నూలు వైపు సాగారు.