ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టుపై అమెరికా ఇప్పటికే స్పందించగా, తాజాగా ఐక్యరాజ్యసమితి స్పందించింది. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ప్రతినిధి స్టీఫెన్ డుజారిక్ భారతదేశంతో సహా ఎన్నికలు జరిగే ఇతర దేశాలు ప్రజల 'రాజకీయ మరియు పౌర హక్కులు' రక్షించబడతాయని బలమైన విశ్వాసాన్ని ప్రదర్శిస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు.
ప్రతి ఒక్కరూ 'స్వేచ్ఛ మరియు న్యాయమైన' ఓటింగ్ వాతావరణాన్ని విశ్వసిస్తున్నట్లు పేర్కొన్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు కేజ్రీవాల్‌ను అరెస్టు చేయడం, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయడం వంటి కారణాలతో భారతదేశంలో నెలకొన్న 'రాజకీయ అశాంతి'పై అడిగిన ప్రశ్నకు ఆయన బదులిచ్చారు.