కైకలూరు నియోజకవర్గంలో సమస్యలు పరిష్కరిస్తామని, కొల్లేరు సరస్సు ప్రధాన సమస్యకు శాశ్వత పరిష్కారం చేస్తానని మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. కైకలూరు లోని ఆయన నివాసం వద్ద గురువారం ఆయన మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే వల్ల ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారో ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకున్నారని అన్నారు. పోలీస్ స్టేషన్ లో ఎన్ని ఇబ్బందులు పెట్టారో తమ దగ్గర వీడియోలతో సహా ఉన్నాయని చూపిస్తానని అన్నారు.