రాష్ట్ర ప్రయోజనాల కోసమే టిడిపి, జనసేన, బిజెపి కూటమి ఏర్పడిందని టీడీపీ శ్రేణులు తెలిపారు. గురువారం పీలేరులో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ అభ్యర్థి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి సూచనలతో సమావేసాన్ని జరిపారు. గడచిన ఐదేళ్లలో నిత్యావసరాలు, విధ్యుత్, ఆర్టీసీ చార్జీలు పెంచి ప్రజల నడ్డి విరిచిన జగన్ కు ఈ ఎన్నికల్లో తగిన బుద్ది చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు.