చిలకలూరిపేట మాజీ సమన్వయకర్త మల్లెల రాజేష్‌నాయుడు, కౌన్సిలర్లతో పలువురు ప్రజా ప్రతినిధులు శుక్రవారం లోకేష్ సమక్షంలో టీడీపీలో చేరారు. గత కొంత కాలంగా మంత్రి విడదల రజినిపై ఆగ్రహంతో ఉండి వ్యక్తిగత విమర్శలకు పాల్పడిన మల్లెల పార్టీని వీడిటానికి నిర్ణయం తీసుకున్నారు. కొన్ని రోజుల నుంచి ఈ విషయం పై టీడీపీ పెద్దలతో జరిపిన మంతనాల అనంతరం మల్లెల టీడీపీ తీర్ధం పుచ్చుకున్నారు.