గుంటూరులో సార్వత్రిక ఎన్నికల ప్రవర్తన నియమావళి ప్రటిష్టంగా అమలు చేస్తున్నామని గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ కీర్తి శుక్రవారం తెలిపారు. రాజకీయ పార్టీలు కూడా ఎన్నికల సంఘం మార్గదర్శకాలను అనుగుణంగా వ్యవహరిస్తూ సహకరించాలన్నారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతో తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇప్పుడు వరకు సరైన పత్రాలు చూపని రూ. 7, 62, 850 నగదును సీజ్ చేశామని చెప్పారు.