లోక్ సభ ఎన్నికలు జరగనున్న ఏప్రిల్ 19న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. తమిళనాడు, పుదుచ్చేరిలోని 40 లోక్‌సభ నియోజకవర్గాలకు ఈ నెల 19న ఒకే దశలో పోలింగ్ జరగనున్న సంగతి తెలిసిందే.
ఆ రోజున ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఉద్యోగులందరికీ వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని, నిబంధనలు ఉల్లంఘించే దుకాణాలు, ఫ్యాక్టరీలు, వాణిజ్య సంస్థలపై చర్యలు తీసుకుంటామని కార్మిక సంక్షేమ శాఖ హెచ్చరించింది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa