టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్‌పై ఎంపీ కేశినేని నాని మండిపడ్డారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ.. ‘ఎన్టీఆర్ పార్టీ పెట్టింది పేదలు, కార్మిక కర్షక వర్గాల కోసం. చంద్రబాబు ఆ సిద్ధాంతాలను తుంగలో తొక్కేశాడు.
చంద్రబాబుకు పేదలంటే చులకన. ధనికులకు మాత్రమే టీడీపీలో టికెట్ ఇచ్చారు. జనసేనలోనూ ఇదే తంతు నడుస్తోంది. పోతిన మహేశ్‌కు టికెట్ ఇస్తానని పవన్ మాట ఇచ్చి నట్టేట ముంచాడు.’ అని ఆరోపించారు.